Anasuya : తమన్నా వల్ల కాలేదు.. అనసూయతో సాధ్యమైంది..!

October 30, 2021 9:52 AM

Anasuya : టాలీవుడ్ గ్లామ‌ర‌స్ హీరోయిన్స్‌లో త‌మ‌న్నా ఒక‌రు. ఈ అమ్మ‌డు మిల్కీ బ్యూటీ అని అభిమానుల‌తో పిలిపించుకుంటుంది. తొలిసారి మాస్ట‌ర్ చెఫ్ కార్య‌క్ర‌మంతో బుల్లితెరకు ప‌రిచ‌యం అయింది. అయితే ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. త‌మ‌న్నా త‌న 18 రోజుల పాటు సమయాన్ని కేటాయించింది. అనంత‌రం త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ వ‌చ్చింది.

Anasuya in master chef trp ratings reportedly increasing

తమ‌న్నా వెండితెర‌పై స్సైసీగా కనిపించిన‌ప్ప‌టికీ బుల్లితెర‌పై అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇటు గ్లామ‌ర్ ప‌రంగా అటు మాట‌ల ప‌రంగా పెద్ద‌గా సంద‌డి చేయ‌లేక‌పోయింది. దీంతో త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ‌ని తీసుకొచ్చారు. అనసూయ రాకతో టీఆర్పీలు భారీగా పెరుగుతాయని ఛానెల్ మేకర్స్ అంచనా వేస్తున్నారు. బుల్లితెర మహారాణిగా తానేంటో ఇప్ప‌టికే నిరూపించింది. ఈ షోతో మరోసారి రుజువవుతుందని కథనాలు వస్తున్నాయి.

జ‌బ‌ర్ధ‌స్త్ షోలో త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేసే అన‌సూయ ఇప్పుడు మాస్ట‌ర్ చెఫ్ కోసం మ‌రింత రెచ్చిపోతోంది. పొట్టి దుస్తుల‌లో షోకి మ‌రింత గ్లామ‌ర్ తెస్తోంది. రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డు అద్భుతాలు చేస్తుంద‌ని నిర్వాహ‌కులు విశ్వ‌సిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు ప్రసారం కాగా.. వాటికి రేటింగ్స్‌ బాగానే వచ్చాయని టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే మాస్టర్‌ షెఫ్‌కు రేటింగ్స్‌ తేవడం తమన్నా వల్ల కాలేదని, అనసూయతోనే సాధ్యమైందని అంటున్నారు. మ‌రి అన‌సూయ త‌నపై ఉంచిన న‌మ్మ‌కాన్ని రానున్న రోజుల్లోనూ నిల‌బెట్టుకుంటుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now