భార‌త్‌కు ఆక్సిజ‌న్ అందిద్దాం రండి.. పాక్ ప్ర‌జ‌ల‌కు షోయ‌బ్ అక్త‌ర్ పిలుపు..

April 26, 2021 4:18 PM

ప్రస్తుతం భారతదేశం కరోనా సంక్షోభంలో మునిగిపోయింది. కరోనా కేసులు తీవ్రంగా వ్యాపించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక ఆరోగ్య వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయింది. ఆక్సిజన్ కొరత వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఇండియాని కాపాడటం కోసం పలు దేశాలు ముందుకు రావాలని, ఇండియాకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడుదామని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ వీడియో ద్వారా ఇండో-పాక్ అభిమానులకు సందేశం ఇస్తున్నారు.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యంతో కూడుకున్న పని. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి కాపాడుదామని పాకిస్తాన్ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఇతర దేశాల సహాయం ఇండియాకు ఎంతో అవసరం ఉంది ఈ సమయంలోనే మనమందరం కలిసికట్టుగా ఉంటూ ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని షోయబ్ తెలిపారు.

ప్రస్తుతం ఇండియాకు చాలా ట్యాంకులు ఆక్సిజన్ అవసరం ఉంది. ప్రతి ఒక్కరు విరాళాలను సేకరించి ఇండియాకు సరిపడేంత ఆక్సిజన్ అందించి ఇండియాను కాపాడాలని షోయబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పిలుపునిచ్చారు. ఇంతకుముందు కూడా ఇండియా పరిస్థితులను గమనించిన షోయబ్ ఇండియాకు సహాయం చేయాల్సిందిగా పలు దేశాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరిన సంగతి మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now