Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత.. శోక‌సంద్రంలో అభిమానులు..

October 29, 2021 2:58 PM

Puneeth Rajkumar : క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్ కుమార్ కొద్ది సేప‌టి క్రితం గుండెపోటుతో క‌న్నుమూశారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో ఆయనకు గుండెపోటు సంభవించినట్లు తెలిపారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న కన్నుమూశారు.

Puneeth Rajkumar died of heart attack fans are very sad

పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్‌. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌ కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. నటసార్వభౌమ, చక్రవ్యూహ, రణవిక్రమ, దొడ్మనె హుడుగ, పవర్.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్ రాజ్‌కుమార్.

పునీత్ మృతితో శాండ‌ల్‌వుడ్ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. క‌ర్నాట‌క అంతా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. థియేట‌ర్స్ అన్నీ మూసివేశారు. ఆసుప‌త్రి వద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. హ‌స్పిట‌ల్ ప్ర‌ధాన మార్గాల‌లో భ‌ద్ర‌తను క‌ట్టుదిట్టం చేశారు. కంఠీర‌వ స్టేడియానికి పునీత్ భౌతిక కాయం త‌ర‌లించ‌నున్నారు. ఆయ‌న మృతితో సినీ పరిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now