Sakshi Vaidya : ఏజెంట్ హీరోయిన్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఛాన్స్.. అదృష్టం మాములుగా లేదు..!

October 29, 2021 10:08 PM

Sakshi Vaidya : ఇటీవలే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అఖిల్. ఈ సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమాని అనౌన్స్ చేశాడు అఖిల్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని పంచాయి. ఈ సినిమాని హై లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు.

Sakshi Vaidya may be got a chance to act with pawan kalyan

ఈ సినిమాలో అఖిల్ కి విలన్ గా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ని సెలెక్ట్ చేశారు. హీరోయిన్‌గా సాక్షి వైద్య న‌టిస్తోంది. ఈ అమ్మ‌డికి ఇది తొలి చిత్ర‌మే అయినా చాలా అద్భుతంగా న‌టించింద‌ట‌. ఈమె ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన సురేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేయ‌బోయే సినిమా కోసం ఈ అమ్మ‌డినే క‌థానాయిక‌గా ఎంపిక చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్టైన చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్‌ లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. త్వ‌ర‌లో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటించనున్నారు. పవన్ 29వ చిత్రంగా వస్తున్నఈ సినిమాలో సాక్షి వైద్య అనే మోడల్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment