Rajnikanth : ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ర‌జ‌నీకాంత్‌.. అసలేం జరిగింది ?

October 29, 2021 10:55 AM

Rajnikanth : త‌మిళ సూప‌ర్ స్టార్ కొద్ది రోజుల క్రితం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోగా, ఆ కార్య‌క్ర‌మంలో చాలా ఉత్సాహంగా క‌నిపించారు. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్‌ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సతీమణి తెలిపారు. రజనీకాంత్‌ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని ల‌తా ర‌జ‌నీకాంత్‌ పేర్కొన్నారు.

Rajnikanth admitted in hospital what happened

గురువారం సాయంత్రం ర‌జ‌నీకాంత్‌ చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. రజనీకాంత్ కావేరీ ఆస్పత్రిలో చేరిన విషయం బయటకు తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రజనీ సన్నిహితులు తెలుపుతున్నారు.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment