Trivikram : త్రివిక్ర‌మ్ సినిమాల్లో హీరోలు చంక‌లో బ్యాగులు ధ‌రించి తిరుగుతుంటారు.. గ‌మ‌నించారా..?

October 28, 2021 4:04 PM

Trivikram : సినీ ద‌ర్శ‌కులు స‌హ‌జంగానే సినిమాల‌ను తెర‌కెక్కించేట‌ప్పుడు కొన్ని సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతుంటారు. కొంద‌రు ద‌ర్శ‌కులకు ట్రెయిన్ సీన్లు అంటే సెంటిమెంట్‌. అందుక‌ని త‌మ సినిమాల్లో ట్రెయిన్ సీన్లు వ‌చ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక కొంద‌రు ద‌ర్శ‌కులు హీరోయిన్ల పేర్ల‌పై సెంటిమెంట్ పెట్టుకుంటారు. అందుక‌నే వారు తీసే సినిమాల్లో దాదాపుగా హీరోయిన్ల పేర్లు ఒక‌టే అయి ఉంటాయి. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కూడా అనేక సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతుంటారు. వాటిల్లో హీరో బ్యాగులు ధ‌రించి తిరిగే సెంటిమెంట్ కూడా ఒక‌టి.

have you observed in Trivikram  movies that heroes wander with bags

అత‌డు సినిమాలో మ‌హేష్ బాబు, జ‌ల్సాలో ప‌వ‌న్ క‌ల్యాణ్, ఖ‌లేజాలో మ‌హేష్ బాబు, అ..ఆ..లో నితిన్, జులాయిలో అల్లు అర్జున్‌, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అజ్ఞాత‌వాసి, అర‌వింద సమేత‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయా సినిమాల్లో హీరోలు బ్యాగులు ధ‌రించి కొన్ని సీన్ల‌లో క‌నిపిస్తారు.

అయితే ఈ సినిమాల్లో ద‌ర్శ‌కుడు పాటించిన ఇంకో సెంటిమెంట్ కూడా ఒక‌టి ఉంది. అదేమిటంటే.. హీరో ఒక చోట ఉండ‌డు. అన్ని చోట్ల‌కూ తిరుగుతుంటాడు. ఈవిధంగా త్రివిక్ర‌మ్ కొన్ని సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతుంటారు. అయితే సెంటిమెంట్ ను అనుస‌రించినంత మాత్రాన సినిమా హిట్ కావాల‌ని ఏమీ లేదు. కానీ త్రివిక్ర‌మ్ మూవీల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. అందుక‌నే ద‌ర్శ‌కులు చాలా వ‌ర‌కు సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతుంటారు. ఆ మాట కొస్తే హీరోలు కూడా కొన్ని సెంటిమెంట్ల‌ను ఫాలో అవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment