Samantha : స‌మంత ఏమాత్రం తగ్గడం లేదుగా.. ఈ సారి ప్రీత‌మ్‌తో..!

October 27, 2021 4:37 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్రేమించి పెళ్లాడిన వ్య‌క్తి దూర‌మ్యాడ‌నే బాధ కూడా లేదు. త‌న ఫ్రెండ్స్‌తో చ‌క్క‌గా టూర్స్ వేస్తోంది. ఇదంతా బాధ నుండి బ‌య‌ట ప‌డ‌డానికే అని కొంద‌రు అంటుంటే, మ‌రి కొంద‌రు మాత్రం స‌మంత‌పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన విష‌యం తెలిసిందే.

Samantha is going to tour with preetham and sadhana

ఇక రీసెంట్‌గా స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్‌ధామ్‌ యాత్రను సందర్శించింది. చార్‌ధామ్‌ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్‌ చేసింది.. ‘మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గధామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. హిమాలయాలను సందర్శించాలనే నా కల నెరవేరింది. దేవుడి మీద నమ్మకం, ప్రస్తుతం ఉండే వాస్తవికత మధ్య ఎప్పుడూ సంక్లిష్టమైన గందరగోళం ఉంటుంది. శిల్పా రెడ్డితో ఈ ప్రయాణం సాగించడం వల్ల మరింత ప్రత్యేకమైందిగా మారింది’ అని చెప్పుకొచ్చింది.

తాజాగా స‌మంత మ‌రో ట్రిప్ ప్లాన్ చేసింది. తన పర్సనల్‌ డిజైనర్‌, స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సాధనా సింగ్‌లతో కలిసి సామ్‌ దుబాయ్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ఫారిన్‌కు వెళ్తున్నాం అని పేర్కొంది. దీంతో ప్రీతమ్‌ పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రీత‌మ్ వ‌ల్ల‌నే చైతూతో స‌మంత విడిపోయింద‌నే వార్త‌లు వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now