Prabhas : పూరీ భార్య గురించి గొప్ప‌గా మాట్లాడిన ప్ర‌భాస్..!

October 27, 2021 1:36 PM

Prabhas : యంగ్ రెబల్ స్టార్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయి వరకు ఎదిగినా అతనిలో ఏమాత్రం గర్వం ఉండదు.. లక్షలాది మంది ప్రజల అభిమానం ఉన్నా.. ఇసువంత అహం ఉండదు. సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ కి యాక్ట్ చేసినా.. ఎలాంటి ఆటిట్యూడ్ ఉండదు. ఆయనే మన డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన ప్రవర్తనతో ఎంతో మంది ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలోనైనా, ఫ్యామిలీకైనా, ఫ్రెండ్షిప్ కైనా ఎక్కువ వాల్యూ ఇస్తాడు.

Prabhas said about puris wife greatness

ఇప్పటికీ ఎప్పటికీ తాను ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోడు. ప్రభాస్ కి ఫస్ట్ నుండి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అలాగే అంతకుమించి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. లేటెస్ట్ గా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. పాన్ వరల్డ్ స్టార్ గా మారిన ప్రభాస్.. అప్ కమింగ్ హీరో, హీరోయిన్స్ ను ఇంటర్వ్యూ చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు. ఈ ఇంటర్య్వూలో ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అత్యధిక ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశామని తెలిపారు. ఆకాష్ పూరీ తల్లి లావణ్య గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు.

ముఖ్యంగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమా షూటింగ్ లో.. పూరీ జగన్నాథ్ భార్య లావణ్య, మరో మహిళతో కలిసి లంచ్ చేశానని అన్నారు. ఆ మహిళ ఎవరని ప్రభాస్ అడిగితే.. లావణ్య.. పనిమనిషి అని ఆన్సర్ ఇచ్చారట. అంత మంచి మనసున్న లావణ్య ఎంతో గొప్పవారని.. ఈ సినిమా ప్రమోషన్ కూడా ఆమె గురించే చేస్తున్నానంటూ ఇన్ డైరెక్ట్ గా అన్నారు. అలాంటి మంచి తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోమని ఆకాష్ కి ప్రభాస్ సలహా ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment