Hyper Adi : బాబోయ్ హైప‌ర్ ఆది స్కిట్‌కి అంత తీసుకుంటాడా.. అత‌ని సంపాద‌న..?

October 27, 2021 8:56 AM

Hyper Adi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు హైప‌ర్ ఆది. అద్భుత‌మైన స్కిట్స్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హైప‌ర్ ఆది త‌న కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటాడు. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలు చేస్తున్నాడు. ఆయ‌న‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప‌లు ఈవెంట్స్‌కి, స్పెష‌ల్ ప్రోగ్రామ్స్‌ కి కూడా ఆహ్వానిస్తుంటారు.

Hyper Adi remuneration for skit know his income

ఇటీవ‌ల బిగ్ బాస్ స్పెష‌ల్ ఎపిసోడ్‌కి పోలీస్‌గా వచ్చిన ఆది.. కంటెస్టెంట్స్‌పై ఇన్వెస్టిగేషన్ అంటూ కామెడీతోపాటు సెటైర్లు కూడా వేశాడు. చుర‌క‌లు వేస్తూ కామెడీ పండిస్తూ మస్త్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఏకంగా మూడు గంటలకు పైగానే సాగిన ద‌స‌రా ఈవెంట్‌లో ఎవరికి వాళ్లు తమ పాత్రను బాగానే పోషించారు. హైపర్ ఆది మాత్రం అందులో సింహభాగం తీసుకున్నాడు. 25 నిమిషాల పాటు సాగిన హైపర్ ఆది ఎపిసోడ్ బాగానే పేలింది.

త‌క్కువ టైంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆది ఒక్క స్కిట్‌కి గానూ రూ.లక్షల్లో అందుకుంటాడని, దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు షోస్‌తో రెండు చేతులా సంపాదిస్తున్నాడ‌ని అంటున్నారు. సొంత ఊర్లో ఇప్పటికే సుమారు 16 ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment