Manchu Manoj : రెండో పెళ్లి వార్త‌ల‌పై మంచు మ‌నోజ్ ట్వీట్‌..!

October 27, 2021 8:06 AM

Manchu Manoj : మంచు మ‌నోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవ‌ల ప‌లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం విదిత‌మే. ఆయ‌న ఓ విదేశీ అమ్మాయిని ప్రేమించార‌ని.. ఇంట్లో పెద్ద‌వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకున్నార‌ని.. దీంతో ఆయ‌న పెళ్లి ఖాయ‌మైపోయింది.. అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌పై మంచు మ‌నోజ్ స్పందించారు.

Manchu Manoj responded over his second marriage news

2015లో వివాహం చేసుకున్న మ‌నోజ్ త‌రువాత కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఒంట‌రిగానే ఉంటున్నారు. అయితే తాజాగా ప‌లు యూట్యూబ్ చాన‌ల్స్, వెబ్‌సైట్ల‌లో ఆయ‌న రెండో పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. ఈ మేర‌కు ఓ వెబ్‌సైట్‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నంపై ఆయ‌న ట్వీట్ చేశారు.

పెళ్లికి న‌న్ను కూడా ఆహ్వానించండి.. పెళ్లి ఎక్క‌డ‌, నేను పెళ్లి చేసుకోబోయే ఆ బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఎవ‌రు.. మీ ఇష్టం రా.. అంతా మీ ఇష్టం.. అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now