భారత్‌కు వెంటిలేటర్లు, వైద్య సామగ్రి పంపిస్తాం.. సహాయం చేస్తామని పాక్‌ వెల్లడి..

April 25, 2021 12:51 PM

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇక సుప్రీం కోర్టు దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీ నెలకొందని వ్యాఖ్యలు చేసింది. దీన్ని బట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చు, దేశంలో కోవిడ్‌ పరిస్థితి ఎలా ఉందో. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితిని చూసి పలు ఇతర దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మన దాయాది దేశమైన పాకిస్థాన్‌ కూడా మనకు సహాయం చేస్తామని ప్రకటించింది.

will send ventilators and medical euipment to india says pakisthan

పాకిస్థాన్‌ ప్రధాని భారత్‌కు కావల్సిన సహాయం చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్‌ ఖురేషి ఇండియాకు సహాయం చేస్తామని ట్వీట్‌ చేశారు. భారత్‌కు తక్షణమే వెంటిలేటర్లు, డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే దీనిపై భారత్‌ స్పందించాల్సి ఉంది.

ఈ సందర్బంగా ఖురేషీ మాట్లాడుతూ.. భారత్‌లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. కరోనాతో తీవ్రంగా పోరాటం చేస్తున్న భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాం. భారత్‌కు అవసరమైన వైద్య సామగ్రి, ఆధునిక యంత్రాలను పంపిస్తాం. ఇందుకు ఇరు దేశాలకు చెందిన అధికారులు కృషి చేయాలి.. అని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now