Puri Jagannadh : పూరీ రొమాంటిక్ మూవీ పాట‌కు చార్మి కుక్క రియాక్ష‌న్‌.. ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది..!

October 26, 2021 10:39 PM

Puri Jagannadh : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరీ, కేతిక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. రొమాంటిక్‌.. ఈ మూవీకి అనిల్ పాదురి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూరీ క‌నెక్ట్స్‌, పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్ల‌పై పూరీ జ‌గ‌న్నాథ్, చార్మీలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ అక్టోబ‌ర్ 29వ తేదీన విడుద‌ల కాబోతోంది.

Puri Jagannadh laughing to charmme kaur dog reaction

రొమాంటిక్ చిత్రానికి చెందిన టీజ‌ర్, పోస్ట‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి ఇప్ప‌టికే చ‌క్క‌ని రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో ఈ మూవీ ద్వారా పూరీ త‌న‌యుడు హిట్ త‌ప్ప‌క సాధిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మూవీలోని పాట‌కు చార్మీ కౌర్ పెంపుడు కుక్క స్పందించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

టీవీలో ఈ మూవీకి చెందిన పాట రాగానే ఆ కుక్క లేచి టీవీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మొరుగుతుంది. అది చూసి పూరీతోపాటు అక్క‌డ ఉన్న వారు ఆశ్చ‌ర్యంగా ఫీలయ్యారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆకాష్ పూరీ భావోద్వేగానికి గుర‌య్యాడు. త‌న తండ్రికి మంచి పేరు తెస్తాన‌ని చెప్పాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment