Sania Mirza : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌.. ఆ వీడియోకు సానియా మీర్జా రియాక్ష‌న్‌..!

October 25, 2021 7:06 PM

Sania Mirza : చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్థాన్ తాజాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో త‌ల‌ప‌డిన విష‌యం విదిత‌మే. అయితే ఈ మ్యాచ్‌లో వార్ వ‌న్ సైడే అన్న‌ట్లుగా పాకిస్థాన్ బౌలింగ్‌, బ్యాటింగ్ విభాగాల్లో భార‌త్‌ను డామినేట్ చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న రికార్డును పాక్ తిర‌గ‌రాసింది. ఐసీసీ టోర్నీల్లో భార‌త్‌పై తొలిసారిగా గెలుపొందింది.

Sania Mirza reacted to video of shoaib malik

అయితే ఈ మ్యాచ్‌లో పాక్ జ‌ట్టులో ఆడుతున్న షోయ‌బ్ మాలిక్ ఆ జ‌ట్టులోనే అత్యంత సీనియ‌ర్ ఆట‌గాడిగా పేరుపొందాడు. పాక్ ఫీల్డింగ్ స‌మ‌యంలో అత‌ను బౌండ‌రీ వ‌ద్ద నిలుచున్నాడు. అయితే అదే స‌మ‌యంలో కొంద‌రు భార‌త జ‌ట్టు ఫ్యాన్స్ అత‌న్ని ‘జిజాజీ’ (బావ‌) అని పిలిచారు. చ‌ప్ప‌ట్లు కొట్టారు. దీంతో మాలిక్ వెన‌క్కి తిరిగి తాను కూడా వాళ్ల‌ను ఉత్సాహ ప‌రిచాడు. చేత్తో సైగ‌లు చేశాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా ఆ వీడియోకు సానియా మీర్జా స్పందించింది. విప‌రీత‌మైన న‌వ్వు, ప్రేమ‌తో కూడిన ఎమోజీల‌ను కామెంట్‌గా పెట్టి ఆ వీడియోను రీట్వీట్ చేసింది. ఆమె పోస్టు వైర‌ల్‌గా మారింది. అయితే మ్యాచ్ భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య అయిన‌ప్ప‌టికీ ప్లేయ‌ర్లు మాత్రం క్రీడాస్ఫూర్తిని క‌న‌బ‌రిచారు. మ్యాచ్ సంద‌ర్బంగా ఎలాంటి గొడ‌వ‌లు చోటు చేసుకోలేదు. పైగా కోహ్లి పాక్ ప్లేయ‌ర్ల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందించి అంద‌రి మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now