Pattabhi : దేశం వదిలి పారిపోతున్న పట్టాభి..? నెటిజ‌న్ల కామెంట్స్‌..!

October 25, 2021 6:18 PM

Pattabhi : తెలుగు దేశం పార్టీ నాయ‌కుడు ప‌ట్టాభి ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలిచారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఆయ‌న‌ను అరెస్టు చేశారు. దీంతో ఆయన జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ త‌రువాత ఆయ‌న ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. స‌డెన్ గా విమానంలో ఆయ‌న ఎక్క‌డికో ప్ర‌యాణం అవుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో ఆయ‌నపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Pattabhi photos in flight going viral in social media

టీడీపీ నేత ప‌ట్టాభి విమానంలో మాల్దీవుల‌కు వెళ్లారంటూ ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజ‌మెంత ? అన్న విష‌యం తెలియ‌దు కానీ ఆయ‌న విమానంలో ఉన్న ఫొటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. ప‌ట్టాభి దేశం విడిచిపెట్టి పారిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే టీడీపీ వారు మాత్రం అవి పాత ఫొటోలు అయి ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఏది ఏమైనా ప‌ట్టాభి ఈ మ‌ధ్య ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజులు ఈ గొడ‌వ‌ల‌కు దూరంగా ప్ర‌శాంతంగా గ‌డిపేందుకు ఆయ‌న మాల్దీవుల‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now