Suresh Babu : సురేష్ బాబుకి ఎంత క‌ష్టం వ‌చ్చింది.. ఏం తేల్చుకోలేక‌పోతున్నారుగా..!

October 25, 2021 10:58 PM

Suresh Babu : ద‌గ్గుబాటి రామానాయుడు వార‌సులు సురేష్ బాబు, వెంక‌టేష్ ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు. సురేష్ బాబు నిర్మాత‌గా, వెంకటేష్ హీరోగా అద‌ర‌గొడుతున్నారు. అయితే మూవీ మొఘల్, దిగ్గజన నిర్మాత అయిన తన తండ్రి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మాదిరిగానే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా మారారు.

Suresh Babu is in confusion upon releasing film in otts or theatres

కరోనా మ‌హ‌మ్మారి అంద‌రి జీవితాల‌ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలా మంది న‌ష్ట‌పోయారు. భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేయాలా..? లేకుంటే థియేట‌ర్‌లో విడుద‌ల చేయాలో తెలియ‌క క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. సురేష్ బాబు త‌న‌కు థియేట‌ర్స్ ఉన్నా కూడా నార‌ప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు.

ఇప్పుడు దృశ్యం 2, విరాటపర్వం సినిమాల విడుదల విషయంలోనూ ఏమి తేల్చుకోలేక‌పోతున్నారు. థియేట‌ర్స్‌కి భారీగానే జ‌నాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ సురేష్ బాబు ఇంకా ఆలోచ‌న‌లోనే ఉన్నారట‌. ఇప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా వరకు తగ్గించేశారు. ఈ టైంలో ఈ రెండు సినిమాలు థియేటర్లకు ఇస్తే లాభాలు వస్తాయా ? నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి ఏమైనా ప్రాఫిట్స్ వ‌స్తాయా.. అనే విష‌యంపై సురేష్ బాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారట‌. రానున్న రోజుల‌లో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసి లాభాలు ఆర్జించాల‌ని అనుకుంటున్నారట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now