Akhil Akkineni : వామ్మో.. ఆ విషయంలో పవన్, చైతన్యని వెనక్కి నెట్టిన అఖిల్..!

October 25, 2021 8:52 AM

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంతవరకు తనకు ఒక్క హిట్ కూడా రాలేదని చెప్పవచ్చు. మూడు సినిమాల తరువాత నాలుగవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సినిమా దసరా కానుకగా విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.

Akhil Akkineni most eligible bachelor record collections in foreign

ఇక యూఎస్ లో విడుదలయ్యే తెలుగు సినిమాలు వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఈ క్లబ్ లో చేరుతాయి. అయితే చిన్న సినిమాల విషయంలో మాత్రం ఇలాంటిది ఎంతో అసాధ్యంతో కూడుకున్న పని. తాజాగా ఇలాంటి అద్భుతమైన రికార్డ్‌ ను స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌ సినిమా సొంతం చేసుకుంది.

కరోనా రెండో దశ తర్వాత విడుదలైన సినిమాలలో అక్కినేని నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. అయితే ఈ ఇద్దరి హీరోలను వెనక్కు నెట్టి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ లను చూడగా నాలుగవ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే విదేశాల్లోనూ అఖిల్‌ సత్తా చాటాడు. పవన్‌, చైతన్యను వారి సినిమాల కలెక్షన్ల విషయంలో వెనక్కి నెడుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment