Malaika Arjun Kapoor : మ‌ద్యం మ‌త్తులో ముద్దుల‌తో ముంచేసిన బ్యూటీ..!

October 24, 2021 3:09 PM

Malaika Arjun Kapoor : బాలీవుడ్ రొమాంటిక్ క‌పుల్ అర్జున్ క‌పూర్ – మ‌లైకా అరోరా ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. మ‌లైకా గ‌తంలో పెళ్లి పీట‌లు ఎక్కినా భ‌ర్తకు విడాకులు ఇచ్చి ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. మలైకా అరోరా ప్రేమలో అర్జున్ కపూర్ పడ్డాడా ? అర్జున్ కపూర్ ప్రేమలో మలైకా పడిందా ? ఇప్ప‌టికీ పెద్ద ప్ర‌శ్న‌నే. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా రొమాన్స్ మాత్రం ఎక్కువే అని చెప్పవచ్చు.

Malaika Arjun Kapoor celebrated malaika birth day

యోగా ట్రైనర్‌గా, మోడల్‌గా, నటిగా రాణిస్తున్న మలైకా అక్టోబర్‌ 23న తన 48వ పుట్టిన రోజుని జరుపుకుంది. ఇటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మరోవైపు మలైకా అరోరా ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకోవడం ఆసక్తికరంగా, హాట్‌ టాపిక్ గా మారింది. మ‌లైకా త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అర్జున్ క‌పూర్ ఇంట్లో ప్ర‌త్య‌క్షం అయింది.

మలైక బర్త్ డేను అర్జున్ కపూర్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సెలెబ్రేషన్స్‌లో కరీనా కపూర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అర్జున్ కపూర్ షేర్ చేసిన ఫోటోను తీసింది తానేనని, కనీసం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని కరీనా కపూర్ కామెంట్ చేసింది. అంటే వీరంతా ఒకే చోట ఉన్నారని తెలిసిపోతోంది. అయితే ఈ ఫోటోలో మాత్రం అర్జున్ కపూర్, మలైక అరోరా మంచి ఫాంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

తనకంటే చాలా చిన్నవాడైన అర్జున్‌తో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతుంది మలైకా. బహిరంగంగానే వీరిద్దరూ కలిసి తిరుగుతుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. పుకార్లని లెక్కచేయకుండా వీరిద్దరూ తమకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు.

https://www.instagram.com/p/CVXByfmo16D/?utm_source=ig_embed&ig_rid=5c5aeca0-7266-4fbb-a6b8-b9d8eff073de

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment