Tollywood : భూముల్ని అమ్ముకున్న స్టార్ హీరో..? వివాదాలు, సమస్యలు చుట్టు ముట్టాయి..?

October 24, 2021 10:28 AM

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ స్టార్‌ హీరో భూముల వివాదంలో ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా తనకు ఉన్న అన్ని భూములను ఆ స్టార్‌ హీరో అమ్ముతున్నట్లు సమాచారం. అయితే కొందరికి అమ్మిన భూముల వల్ల బాగా ఇబ్బందుల్లో పడిపోయాడని టాక్‌ వినిపిస్తోంది.

Tollywood  one star hero sold lands got problems

సదరు స్టార్‌ హీరో గతంలో హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న అనేక భూములను కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పుడు అవే భూములను అమ్మకానికి పెట్టారు. కానీ ఆ భూముల విషయం వివాదాస్పదం అయింది. అవి ఆక్రమణలకు గురైన భూములు అంటూ వివాదం చెలరేగింది. దీంతో ఆ హీరో ఆ భూముల విషయంలో ఇబ్బందులు పడుతున్నారట.

ఆ హీరో సదరు వివాదాస్పద భూములను కొంత మంది పవర్‌ ఫుల్‌ వ్యక్తులకు అమ్మాడట. దీంతోనే అసలు సమస్యంతా వచ్చింది. భూములను చట్ట విరుద్ధంగా అమ్మారని చెబుతూ ఆ స్టార్‌ హీరోను ఆ పవర్‌ ఫుల్‌ వ్యక్తులు ప్రశ్నిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ హీరో తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే కొందరు స్నేహితులు మాత్రం ఆ భూమిని వదులుకోమని సలహా ఇస్తుండగా.. కొందరు మాత్రం పొలిటికల్‌ లీడర్ల సహాయం తీసుకోమని సలహా ఇస్తున్నారట. దీంతో భూమిని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని.. ఎవరి వద్దకు అయినా వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఆ స్టార్‌ హీరో ఉన్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment