Roja Daughter : సినిమాలలోకి రోజా కుమార్తె.. గ్రాండ్‌ ఎంట్రీ..?

October 23, 2021 2:00 PM

Roja Daughter : నటిగా, ఎమ్మెల్యేగా సినిమా ఇండస్ట్రీలోనూ, రాజకీయాలలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ.. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. రోజా తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వీరి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Roja Daughter to enter into cine industry in a grand way

ఇంత చిన్న వయసులోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అన్షు ఎంతో అందంగా ఉండడంతో పలువురు అభిమానులు ఈమె వెండితెరపై ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనుంది.. అంటూ ఎన్నో సార్లు ప్రశ్నించారు. అయితే ఆ సమయం దగ్గర పడుతోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రోజా కూతురు త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని.. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇప్పటికే రోజా కూతురు యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ కూడా తీసుకుంటుందని.. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తుందా.. లేక తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

రోజా కూతురు ఒక స్టార్ హీరో కొడుకుతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అయితే ఆ సినిమా ఏంటి ? దర్శకుడు ఎవరు ? అనే విషయాల గురించి త్వరలోనే తెలియజేయనున్నారు. రోజా కూతురు కూడా రోజా మాదిరి అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మరి ఈమె కూడా రోజా అంతటి గుర్తింపు సంపాదించుకుంటుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now