Tamannaah : ఆ హీరోతో ప్రేమలో పడిన తమన్నా..? చివరికి ఆ హీరో తండ్రి అడ్డుకోవడంతో అలా ?

October 22, 2021 6:03 PM

Tamannaah fell in love with that hero but his father did not accepted it

Tamannaah : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం వెండితెరపై, బుల్లి తెరపై నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. అదే విధంగా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న తమన్నా గతంలో ఒక హీరోతో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది.

తమిళ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్తీతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ జంటగా నటించిన ఆవారా సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై తమన్నా స్పందిస్తూ.. మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేదని తేల్చి చెప్పింది.

అయితే ఆవారా సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి వెంటనే మరో సినిమాతో సందడి చేయడంతో అందరి అనుమానాలు బలం అయ్యాయి. ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, కార్తీ తండ్రి వీరి ప్రేమకు అడ్డు పడినట్లు తెలుస్తోంది. కార్తీ అన్నయ్య, హీరో సూర్య కూడా హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కార్తీ కూడా మరొక హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదని ఆయన తండ్రి చెప్పాడట. దీంతో తమన్నా, కార్తీల పెళ్లి ఆగిపోయిందని టాక్. ఈ క్రమంలోనే కార్తీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment