Bigg Boss 5 : ఆ ఇద్ద‌రిలో ఈ వారం ఒకరు ఔట్.. !

October 22, 2021 5:34 PM
Bigg Boss 5 this week one will be eliminated from those two

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త సీజ‌న్ క‌న్నా కూడా ఈ సీజ‌న్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు ఎలిమినేట్ కాగా, అందులో ఐదుగురు మ‌హిళా కంటెస్టెంట్సే కావ‌డం విశేషం. ఈ వారం కూడా మ‌హిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుంద‌ని జోస్యాలు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత ఇలా వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు.

ఇక ఏడో వారం నామినేష‌న్‌లో కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జ‌స్వంత్, లోబో ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో ఉన్న వారిలో కాజ‌ల్‌, ర‌వి, ప్రియ‌, శ్రీరామ్ కాస్త స్ట్రాంగ్ కాగా, జ‌స్వంత్‌, సిరీల‌కు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనీమాస్ట‌ర్, లోబోల‌కు మాత్ర‌మే కాస్త త‌క్కువ ఫాలోయింగ్ ఉంది.

సిరిని ఈ వారం సేవ్ చేస్తే అనీ మాస్ట‌ర్, లోబోల‌లో ఒక‌రు బ‌య‌ట‌కు రావ‌డం ఖాయం. ఈ వారం లోబో పెద్ద‌గా గేమ్ ఆడ‌లేదు కాబ‌ట్టి అనీ మాస్ట‌ర్‌ని టార్గెట్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక వేళ సిరి ఎలిమినేట్ అయితే మోజ్ రూమ్ బ్యాచ్ లో ఒకరు త‌గ్గ‌నున్నారు. దీంతో గేమ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఏది ఏమైనా ఈ వారం హౌజ్ నుండి మ‌హిళా కంటెస్టెంట్ బ‌య‌ట‌కు రావ‌డం ఖాయం అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now