Jabardasth : జ‌బ‌ర్ధ‌స్త్ చూడ‌నంటున్న రోజా అత్త‌.. ఎందుకో తెలుసా ?

October 22, 2021 3:02 PM

Jabardasth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ కార్య‌క్ర‌మాన్ని పిల్లా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీక్షిస్తుంటారు. ఈ మ‌ధ్య డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ కావ‌డం వ‌ల్ల కుటుంబ స‌భ్యులు అంతగా ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ షోకి మొద‌ట్లో నాగబాబు, రోజా జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించ‌గా ఇప్పుడు నాగ‌బాబు స్థానంలో మ‌నో వ‌చ్చారు. వీరు కూడా త‌మ‌దైన శైలిలో కామెడీ పండిస్తున్నారు.

mla roja mother in law says she did not watch Jabardasth

జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మానికి జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే ఈ షో చేస్తూ ఉంటున్నారు. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ షోకి ఫుల్ ఫ్యాన్ ఫాలొయింగ్ ఉండ‌గా, రోజా అత్త మాత్రం షోని చూడ‌నంటోంది. రోజా, ఆమె అత్త చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రోజా ఎంతో కష్టపడి ఇంటికి వస్తే తనకు ఇష్టమైనవన్నీ చేసి పెడతానని రోజా అత్త తెలియజేశారు.

రోజాలో తనకు చాలా ఇష్టమైనది తన నవ్వు అని ఆమె అత్త చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఆమె డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు. సినిమాలలో, షోస్ లో చేసే డ్యాన్స్ లను తను వీక్షిస్తానని చెప్పారు. జబర్దస్త్ లో షో ప్రారంభంలో ఆమె చేసే డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. రోజా డ్యాన్స్ చూసి టీవీ క‌ట్టేస్తానంటుంది రోజా అత్త‌. అది స‌రిగా అర్ధం కాక‌పోవ‌డం వ‌ల్ల‌నే తాను అలా చేస్తానంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now