RGV : వారిని బాక్సింగ్ నేర్చుకోమంటున్న వ‌ర్మ‌.. ఎందుకో తెలుసా?

October 22, 2021 8:12 AM

RGV : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్-వైసీపీ మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌ర‌గ‌గా, ఇప్పుడు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న చందాన మారింది. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా చంద్ర‌బాబు నిరస‌న చేప‌ట్టారు.

RGV tweeted that tdp and ysp leaders should learn boxing

తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీడీపీ నేతలు దూషించారంటూ వైసీపీ శ్రేణులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. మ‌రోవైపు టీడీపీ శ్రేణులు త‌మ వ‌ర్షెన్ తాము చెబుతున్నాయి. అయితే ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌దైన స్టైల్‌లో స్పందించే వ‌ర్మ ఏపీ రాజ‌కీయాల‌పై కూడా ట్వీట్ చేశారు.

‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. బాక్సింగ్ నేర్చుకుంటే ఒక‌రికొక‌రు మంచిగా ఫైట్ చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై కూడా వ‌ర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. సినిమావాళ్ల‌ను స‌ర్క‌స్ అంటూ చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now