టీవీ నటిపై దాడికి పాల్పడిన బిజినెస్ మ్యాన్‌.. చివరికి ఏం జరిగిందంటే?

October 21, 2021 10:19 PM

మహిళలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ రోజురోజుకూ ఆగడాలు అధికమయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీలో తన పనులను ముగించుకుని ముంబై వెళ్తున్న తనపై ఓ బిజినెస్ మ్యాన్‌ లైంగిక దాడికి ప్రయత్నించాడు.. అంటూ ఓ నటి ఆరోపించింది.

TV actress molested in Delhi to Mumbai flight: Business Man arrested

తన పేరును చెప్పడానికి నిరాకరించిన టీవీ నటి అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో ఫ్లైట్‌లో ముంబైలో ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే ప్రయాణికులు దిగడానికి లేచి నిలబడగా గజియాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వచ్చి తన పక్క సీట్లో కూర్చున్నాడు. అయితే తను దిగడానికి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారవేత్త వెనక నుంచి తన నడుముని గట్టిగా పట్టుకోవడమే కాకుండా లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.. అంటూ ఆరోపణలు చేసింది.

ఒక్కసారిగా ఆ వ్యాపారవేత్త అలా చేయడంతో ఎంతో షాక్ అయ్యి గట్టిగా కేకలు వేసింది. అయితే అతను అక్కడ ఉన్నది మగ ప్యాసింజర్ అనుకున్నాడట. అందుకనే అలా ప్రవర్తించానని అతను చెప్పాడు. అయితే అలా ప్రవర్తించినందుకు అతను క్షమాపణలు చెప్పాడని.. అది చూసి తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని.. ఈ సందర్భంగా నటి తెలిపింది. ఈ క్రమంలోనే ఆ నటి సదరు వ్యాపారవేత్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వ్యాపారవేత్తను కస్టడీలోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now