KBC : అమితాబ్ పేరు వెనుక బచ్చన్ అని ఎందుకు పెట్టుకున్నారో తెలుసా?

October 21, 2021 9:18 PM

KBC : బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి  తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం 13వ సీజన్ ఎంతో విజయవంతంగా ప్రసారమవుతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి మహారాష్ట్రలోని జల్‌గావ్‌కి చెందిన భాగ్యశ్రీ అనే మహిళ వచ్చింది. ఈమె గేమ్ ఆడటానికి ముందుగా తన వ్యక్తిగత విషయాలను అమితాబ్‌ తో పంచుకుని భావోద్వేగం అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ప్రేమ వివాహం చేసుకున్నానని.. తనకు కూతురు పుట్టినా తన తండ్రి ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదని బావోద్వేగ మయ్యింది.

KBC amitabh bachchan told how he got bachchan name

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్.. భాగ్యశ్రీ తండ్రి చూస్తూ ఉంటే క్షమించి తనను అక్కున చేర్చుకోండి.. అంటూ తన తండ్రికి సూచించారు. ఇలా అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ 80 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే అని, వారి ఇద్దరి కులాలు వేరే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

అయితే వారు పెళ్లి చేసుకున్న తర్వాత తను స్కూల్లో చేర్పించడానికి ఇంటి పేరు ఏంటి అని ప్రశ్నించగా తన తల్లిదండ్రులు వారి ఇద్దరి కులానికి చెందిన ఇంటి పేరును కాకుండా తన తండ్రి కథలు రాయడంతో అతని కలం పేరును బచ్చన్ అని పెట్టుకున్నారు. అలా తన పేరు చివర ఇంటి పేరుగా బచ్చన్ అని వచ్చిందని ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ అనే పేరు వెనుక దాగి ఉన్న కథను తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment