Kota Srinivasa Rao : కోట శ్రీ‌నివాస రావు.. మ‌ళ్లీ అనేశారు.. నాగ‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

October 21, 2021 12:49 PM

Kota Srinivasa Rao : టాలీవుడ్ సీనియర్‌ సినీ నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. మొదట్నుండి ఈయన వ్యవహార శైలి వేరుగానే ఉంటోంది. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లో పలువురిపై కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది. రీసెంట్ గా బుల్లితెర యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే. అలాగే మా ఎన్నికల క్రమంలో ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేశారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు.. మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుకు సపోర్ట్ చేశారనే విషయం పబ్లిక్ గానే తెలుసు.

Kota Srinivasa Rao again sensational comments on nagababu

ప్రకాష్ రాజ్ తో కలిసి దాదాపుగా తాను 15 సినిమాల్లో వర్క్ చేసినా.. ఆయన ఒక్కసారి కూడా టైమ్ కి వచ్చింది లేదని కామెంట్స్ చేసిన విషయమూ తెలిసిందే. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు లేకపోతే నాగబాబు అనేవాడు ఎవరు ? అంటూ ప్రశ్నించారు. ఆయనేమీ గొప్ప నటుడు కాదంటూ కామెంట్ చేశారు. గతంలో తాను ప్రకాష్ రాజ్ ని అనడంతో నాగబాబు తనను విమర్మించారని మండి పడ్డారు. అసలు నేను నాగబాబుని ఏమైనా కామెంట్ చేశానా.. రీసెంట్ గా ఆయన నాపై చేసిన కామెంట్స్ కి నేను టీవీ ఛానెల్స్ లో స్పందించి ఉంటే పెద్ద గొడవయ్యేదని కోట శ్రీనివాసరావు అన్నారు.

అలాగే అప్పుడు ఒక మాట, ఇప్పుడొక మాట చెప్పనని.. ఎప్పటికీ ఒకే మాట మీద ఉంటానని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కనుక లేకపోతే నాగబాబు ఎవరో కూడా జనాలకు తెలీదని అన్నారు. ఇప్పటికీ ఆయన్ను ఎవరైనా సంబోధించాలంటే మెగా బ్రదర్ అనే అంటారని వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ పై చేసిన కామెంట్స్ కి కోట శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ.. కొంతమందికి వయస్సు పెరుగుతుంది గానీ.. బుద్ది పెరగడం లేదంటూ పోయే వయస్సుకు దగ్గరపడినా ఇంకెప్పుడు మారతారో అంటూ హీట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై నాగబాబును పలువురు నటీనటులు తప్పు పట్టారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ అనేవి ఎంతోమంది నటుల్ని హైలెట్ చేశాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now