ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటే ఏమిటో తెలుసా?

April 24, 2021 5:30 PM

ప్రస్తుత కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదంఆండ్రోజినస్ ఫ్యాషన్ . సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రస్తుతం ఈ ఫ్యాషన్ సంస్కృతి విస్తరిస్తోంది. అసలు ఈ ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటే ఏమిటి? దీనిపై ఎందుకిలా చర్చలు జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం..

ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటే ఈ సమాజంలో ఎవరికి నచ్చిన విధంలో వారి వస్త్రధారణలో ఉండటమే ఈ
ఆండ్రోజినస్ ఫ్యాషన్ .మగవారు ఆడవారి వేశధారణ, ఆడవారు మగవారి వేశధారణ.. ఇలా వారికి నచ్చిన రీతిలో జీవించేందుకు ఇష్టపడుతున్నారు. సంస్కృతి కట్టుబాట్లను పక్కన పెట్టి వారి ఇష్టాయిష్టాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

తాజాగా, కోల్​కత్తాకి చెందిన పుష్పాక్ సేన్ అనే వ్యక్తి చీరతో అలంకరించుకొని.. ఆ ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారి సోషల్ మీడియాలో ఈ ఆండ్రోజినస్ ఫ్యాషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా పుష్పక్ గ్రీన్ కలర్ శారీ ధరించి, ఎర్రటి లిప్ స్టిక్ పెట్టుకొని ఉన్నటువంటి ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు పుష్పక్ సేన్ ఇష్టాలను స్వాగతిస్తూ కామెంట్ చేయడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment