Sai Dharam Tej : సాయిధ‌ర‌మ్‌ని క‌లిసిన హ‌రీష్ శంక‌ర్.. ఫొటో విడుద‌ల చేయ‌డంతో ఫ్యాన్స్ హ్యాపీ..!

October 21, 2021 8:14 AM

Sai Dharam Tej : రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం రోజురోజుకూ కుదుట‌ప‌డుతోంది. గత నెల 10న తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు తేజ్‌. ద‌స‌రా రోజున త‌న బ‌ర్త్ డే కాగా, ఆ రోజు అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. ఈ విష‌యాన్ని చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌న్‌ఫాం చేశారు.

harish shankar visited Sai Dharam Tej fans full happy

వినాయక చవితి రోజున బైక్‌పై వెళ్తున్న సాయి ధరమ్‌ తేజ్‌.. ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తేజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. కాలర్‌ బోన్‌ విరగడంతో సర్జరీ చేశారు. ప్రమాద తీవ్రత కారణంగా సాయిధరమ్‌ తేజ్‌ కోమాలోకి వెళ్లాడని స్వయంగా పవన్‌ కల్యాణే కామెంట్ చేశారు. 35 రోజుల పాటు చికిత్స తీసుకున్న సాయిధరమ్‌ తేజ్ కోలుకోవ‌డం అంద‌రికీ ఆనందం క‌లిగించింది.

ఇంటికి వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్‌ని ప‌రామ‌ర్శిస్తున్నారు . తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ తేజ్‌ని పరామర్శించారు. నా సోదరుడు సాయి తేజ్‌ని కలిశాను, అతను సూపర్ ఫిట్‌గా ఉన్నానని, త్వరలోనే కోలుకుంటున్నానని చెప్పడం చాలా సంతోషంగా అనిపించిందని చెబుతూ తేజ్‌తో చేతులు కలిపిన ఫోటోను హరీశ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

ఆ మ‌ధ్య సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన విష‌యం తెలిసిందే. . ‘నాపై, నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను.. అనే సంకేతం పంపించారు.

https://twitter.com/harish2you/status/1450819836104171529?s=20

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now