JioPhone Next : చ‌వ‌క ధ‌ర‌కే జియో ఫోన్ నెక్ట్స్ వ‌చ్చేస్తోంది.. లీకైన స్పెసిఫికేష‌న్లు.. ఎలా ఉన్నాయంటే ?

October 20, 2021 10:12 PM

JioPhone Next : టెలికాం కంపెనీ రిల‌య‌న్స్, సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ క‌లిసి సంయుక్తంగా రూపొందిస్తున్న జియో ఫోన్ నెక్ట్స్‌కు చెందిన స్పెసిఫికేష‌న్స్ నెట్‌లో లీక్ అయ్యాయి. అభిషేక్ యాద‌వ్ అనే యూజర్ ఈ ఫోన్‌కు చెందిన స్పెసిఫికేష‌న్స్ వివ‌రాల‌ను ట్వీట్ చేశారు. ఈ వివ‌రాలు గూగుల్ ప్లే క‌న్సోల్‌లో న‌మోదు కాబ‌డ్డాయి.

JioPhone Next specifications leaked know how are they

జియో ఫోన్ నెక్ట్స్‌లో హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ డిస్‌ప్లే సైజ్ గురించి చెప్ప‌లేదు. కానీ 4.7 ఇంచులుగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ 720 x 1440 పిక్స‌ల్స్ గా ఉంది. అలాగే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 215 ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు దీంట్లో ఉన్న‌ట్లు లీకైన స్పెసిఫికేష‌న్స్ ను చూస్తే అర్థ‌మ‌వుతోంది.

కాగా ఈ ఫోన్ ను రిలయ‌న్స్ ఏజీఎంలో ముకేష్ అంబానీ ప్ర‌క‌టించారు. వినాయ‌క చ‌వితికే ఈ ఫోన్‌ను లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్‌ల కొర‌త కార‌ణంగా ఈ ఫోన్ విడుద‌ల‌ను దీపావ‌ళికి వాయిదా వేశారు. అయితే దీపావ‌ళి రోజు ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తారేమోన‌ని వినియోగ‌దారులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధ‌ర‌ను రూ.3,499 గా నిర్ణ‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now