Jabardasth Avinash : పెళ్లి పెళ్లి అని క‌ల‌వ‌రించిన అవినాష్.. ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకున్నాడుగా..!

October 20, 2021 4:19 PM

Jabardasth Avinash : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అవినాష్ బిగ్‏బాస్‏లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు . ఆరియానాతో ఎక్కువగా స్నేహం చేసి.. నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. దాదాపు పైనల్ వరకు వెళ్లిన అవినాష్.. అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాకయ్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా అరియానాతో సంద‌డి చేశాడు. ఒకానొక సంద‌ర్భంలో ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

Jabardasth Avinash got married comedians came

క‌ట్ చేస్తే పెళ్లి పెళ్లి అని కలవరించిన ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు అయ్యాడు. అనూజ అనే అమ్మాయి మెడలో తాళి కట్టి కొత్త జీవితం మొదలుపెట్టాడు అవినాష్. మంగళవారం జరిగిన ఈ వివాహ వేడుకకు యాంకర్ శ్రీముఖితో పాటు.. జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు.

దివి, అరియానా గ్లోరీ, సయ్యద్‌ సోహైల్‌తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు. రాంప్రసాద్‌ ‘సారీ బ్రదర్‌ బ్లండర్‌ మిస్టేక్‌ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్‌ చేశాడు. అవినాష్‌ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్‌ చానల్‌ లో విడుదల చేసి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్ షేర్ చేశాడు.

బిగ్‏బాస్‏లో ఉన్న సమయంలో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు అవినాష్. గతంలో ఓసారి అవినాష్ పెళ్లి గెటప్‏లో ఉన్న ఫోటోను సైతం నెట్టింట్లో షేర్ చేయడంతో నిజంగానే అవినాష్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఎట్ట‌కేల‌కు వివాహం చేసుకొని అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now