ఆక్సిజన్‌ సిలిండర్‌ అడిగితే చెంప దెబ్బలు కొడతానన్న కేంద్ర మంత్రి.. వీడియో..!

April 23, 2021 3:24 PM

మా అమ్మ చావు బతుకుల్లో ఉంది, ఆక్సిజన్ సిలిండర్‌ సరఫరా అయ్యేలా చూడండి.. అని ఓ వ్యక్తి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌కు గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఆ మంత్రివర్యులు మాత్రం ఎక్కువ మాట్లాడితే రెండు చెంప దెబ్బలు కొడతానని బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోలో ఉన్న జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది.

man asked for oxygen cylinder union minister prahlad patel two slaps

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ గురువారం సదరు హాస్పిటల్‌ను సందర్శించారు. అయితే ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి తన తల్లి కోవిడ్‌తో చికిత్స పొందుతుందని, ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ 2 గంటలే వస్తుందని, కనుక ఆక్సిజన్‌ సిలిండర్‌ సరఫరా అయ్యేలా చూడాలని మంత్రిని కోరాడు. అయితే అందుకు ప్రహ్లాద్‌ పటేల్‌ అసహనం ఫీలయ్యారు. ఎక్కువ మాట్లాడితే రెండు చెంప దెబ్బలు కొడతానన్నారు. అయినా సరే తాను చెంప దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమని, కానీ ఆక్సిజన్‌ సిలిండర్‌ను మాత్రం ఇవ్వాలని, లేదంటే తన తల్లి చనిపోతుందని అతను ప్రాధేయపడ్డాడు.

కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నెటిజన్లు కూడా ఆయన వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఓ వ్యక్తి సహాయం చేయమని వస్తే ఆయన అలా అనడం అత్యంత హేయమైన చర్య అని కామెంట్లు చేశారు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం ఆ వ్యక్తి పరుష పదజాలంతో మాట్లాడాడని, అందుకనే మంత్రి అలా అన్నారని, అందులో వేరే ఉద్దేశం లేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహాయం చేయమని అడిగిన వారిని అలా అనడం సరికాదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment