Most Eligible Bachelor : అల్లు అరవింద్ త‌గ్గ‌ట్లేదుగా.. పూజాని అంద‌రిముందు డార్లింగ్ అనేశాడే..!

October 20, 2021 9:41 AM

Most Eligible Bachelor : అఖిల్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కురిపిస్తోంది. ఈ క్ర‌మంలో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Most Eligible Bachelor allu aravind comments on pooja hegde going viral

నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసు, దర్శకులు సురేందర్‌ రెడ్డి, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అయితే కార్య‌క్ర‌మంలో బ‌న్నీ, ఆయ‌న తండ్రి అల్లు అరవింద్ పూజా హెగ్డేపై చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. బ‌న్నీ.. పూజా గురించి చెబుతూ.. నా ఒక్కడికే తను స్పెషల్‌ అనుకున్నా.. కానీ కాదు. అందరికీ స్పెషలే. తను ఏ హీరోతో నటిస్తే వారు హిట్‌ అందుకున్నట్టే అని అన్నారు. ఇక అల్లు అర‌వింద్ తగ్గేదేలే అంటూ వేదికపై స్పీచ్ స్టార్ట్ చేశారు.

పూజా గురించి మాట్లాడిన అర‌వింద్ .. మా డార్లింగ్ పూజా అనేశాడు. ఈ సినిమాలో చించేసింది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కెరీర్‌లో ఇదో బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ అని గర్వంగా చెబుతున్నా అన్నారు. నీ కెరీర్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్నారు అరవింద్. భాస్కర్‌తో సినిమా తీసేటప్పుడు ఒళ్లునొప్పులు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now