Ram Gopal Varma : సిని’మా’ వాళ్ల‌ను జోక‌ర్స్‌గా పోల్చిన వ‌ర్మ‌.. మండిప‌డ్డ మంచు మ‌నోజ్..

October 19, 2021 10:22 PM

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతుంటారు. సినిమాలు, రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై ఆయ‌న చేసే కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంటాయి. రీసెంట్‌గా ఆయ‌న మా ఎన్నిక‌లు జ‌రిగిన తీరుపై సెటైరిక‌ల్‌గా స్పందించాడు. మొత్తం జోక‌ర్ల‌తో సిని’మా’ స‌ర్క‌స్ నిండిపోయింద‌ని వ‌ర్మ‌ ట్వీట్ చేశారు. వ‌ర్మ ట్వీట్‌ని కొంద‌రు స‌పోర్ట్ చేశారు. మ‌రి కొంద‌రు వ్య‌తిరేకించారు.

Ram Gopal Varma satire on maa manchu manoj counters

తాజాగా హీరో మంచు మ‌నోజ్‌ స్పందించాడు. సిని’మా’ స‌ర్క‌స్ తో నిండిపోతే , ‘మీరు అందులో రింగ్ మాస్ట‌ర్ స‌ర్’ అంటూ ఎద్దేవా చేశాడు. దీనిపై కొంద‌రు స‌రైన స్టైల్‌లో కామెంట్ చేశాంటూ ప్ర‌శంసించారు. కాగా రామ్ గోపాల్ వ‌ర్మ అలా కామెంట్ చేయ‌డం వెనుక కార‌ణం కూడా లేక‌పోలేదు. మా ఎల‌క్ష‌న్స్ పేరుతో లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల కుంపట్లు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం ఇలా ఎన్నో విష‌యాల‌పై ఒక‌రికొక‌రు అర‌చుకున్నారు.

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌, విష్ణు ప్యానెల్ మ‌ధ్య ఎంత‌టి గొడ‌వ‌లు జ‌రిగాయో కూడా మనం చూశాం. మోహన్‌బాబు, నరేష్‌ భౌతిక దాడులకు దిగారని, బండబూతులు తిట్టారని చెబుతున్నారు. ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. కౌంటింగ్‌ జరిగిన తీరుపైనా డౌట్స్ రైజ్‌ చేశారు. సీసీ ఫుటేజ్ కావాల‌ని కూడా ప్ర‌కాశ్ రాజ్ కోరిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now