Ram Gopal Varma : సీఎం కేసీఆర్‌కు ఈటల వెన్ను పోటు పొడిచాడా.. వ‌ర్మ చిత్రంలో ఏం చెప్ప‌బోతున్నాడు..!

October 19, 2021 5:20 PM

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సినిమాలు, రాజ‌కీయాలు, వివిధ అంశాల‌పై త‌న అభిప్రాయాలను తెలియ‌జేస్తూ ర‌చ్చ చేస్తుంటారు. రీసెంట్‌గా తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా దంపతుల నేపథ్యం బేస్ చేసుకుని కొండా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు.

Ram Gopal Varma new pic creating sensation in social media

గాంధీ లెక్క రెండో చెంప చూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే ? అంటూ తీక్షణమైన చూపులతో ఉన్న హీరో కేరక్టరైజన్‌ పోస్టర్‌లో కనిపిస్తోంది. మరో పోస్టర్‌లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్‌ లుక్‌తో కొండా ముర‌ళి క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. ఈ సినిమాతో రాజ‌మౌళి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

సీఎం కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తెలంగాణ నాయకుడు ఈటల రాజేందర్ జీవితకథతో సినిమా తీస్తున్నారట..! నిజమేనా ? అని ఓ నెటిజ‌న్ వ‌ర్మ‌ని ప్రశ్నించారు. దీనికి వ‌ర్మ‌.. నాకెందుకో ఈటల రాజేందర్ కేసీఆర్ కు వెన్నుపోటు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు.. సేమ్ అనిపించింది. ఈ ఎపిసోడ్ పై తెలంగాణ నాయకుల్ని కనుక్కుని సినిమా తీస్తా ! అంటూ వర్మ ట్వీట్ చేసిన ఓ ఇమేజ్ ని సదరు అభిమాని షేర్ చేశారు. ఈ సినిమా పేరు `వెన్నుపోటు ఈటల` అంటూ పోస్టర్ ని వేయడం ఆసక్తికరం. ఈ మార్ఫ్ డ్ ఇమేజ్ పోస్టర్ లో కేసీఆర్ బాహుబలి అయితే వెన్నుపోటు పొడిచే కట్టప్పగా ఈటల కనిపించారు. మ‌రి రానున్న‌రోజుల్లో వ‌ర్మ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Will Varma make a film on Etela And KCR

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now