Akhil Akkineni : త్వరలోనే.. అయ్యగారే నంబర్ వన్.. అభిమానిని కలవనున్న అక్కినేని హీరో..!

October 19, 2021 12:43 PM

Akhil Akkineni : టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు అఖిల్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ దసరా కానుకగా ఈ ఏడాది అతను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరిస్తోంది.

Akhil Akkineni told about a fan who said ayyagare number one

అయితే గతంలో అఖిల్ నటించిన సినిమాలను చూసిన ఒక అభిమాని అఖిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఖిల్ గురించి అభిమాని మాట్లాడుతూ.. ‘అయ్యాగారే నంబర్ వన్. అఖిలే తోపు. ఎవరి వల్లా కాదు.’ అంటూ రచ్చ చేశాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నలకు అఖిల్ సమాధానాలను తెలియజేశాడు.

https://www.instagram.com/p/CVLDwgypl5w/

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ. .నా ఫ్యాన్ ఇంత పాపులర్ కావడం సంతోషంగా ఉంది. ‘అయ్యగారే నంబర్ వన్’ అనే పదం నా జీవితాన్ని మార్చేసింది. ఆ పదాన్ని నా సినిమాలో కూడా ఉపయోగించాము. తప్పకుండా త్వరలోనే ఆ అభిమానిని కలుస్తాను.. అంటూ ఈ సందర్భంగా అఖిల్ ఒక వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now