8జీబీ ర్యామ్‌, 5జి స‌పోర్ట్‌తో రియ‌ల్‌మి 8 5జి.. ధర త‌క్కువే..!

April 22, 2021 10:29 PM

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. రియ‌ల్‌మి 8 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. 5జి కి ఇందులో సపోర్ట్ ల‌భిస్తుంది. యూజ‌ర్ల‌కు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది.

realme 8 5G smart phone launched in india

ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఫోన్‌కు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపు ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఈ ఫోన్‌లో ల‌భిస్తుంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

రియ‌ల్‌మి 8 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌, 4/8 జీబీ ర్యామ్
  • 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1
  • యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి 8 5జి ఫోన్ సూప‌ర్‌సోనిక్ బ్లూ, సూప‌ర్‌సోనిక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,999గా ఉంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now