Multiplex : ముగ్గురు హీరోల కాంబినేష‌న్‌లో మ‌ల్టీ ప్లెక్స్.. నిర్మాణం ఎక్క‌డో తెలుసా?

October 17, 2021 11:21 PM

Multiplex : ఒక‌ప్పుడు ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌.. సినిమా ప్రేక్ష‌కుల‌తో ఎంత సందడిగా ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద సినిమా విడుద‌ల అవుతుంది అంటే ఆ ప్రాంతాల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. సినిమా హీరోలు కూడా తొలి రోజు అక్క‌డికి వ‌చ్చి అభిమానుల‌తో క‌లిసి సినిమాలు చూసేందుకు ఆస‌క్తి చూపేవాళ్లు. కానీ సింగిల్ స్క్రీన్ హబ్ అయిన ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్ నెమ్మదిగా మల్టీప్లెక్స్ హబ్ గా మారుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Multiplex will be built with 3 heroes

ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే మునుముందు తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల సింగిల్ థియేటర్లు కనుమరుగై ఆ స్థానాల్లో మల్టీప్లెక్సులు మొదలవుతాయ‌న్న‌ట్లుగా అనిపిస్తోంది. ఏషియ‌న్ వారు ప‌లువురు హీరోల‌తో క‌లిసి అనేక చోట్ల మ‌ల్టీ ప్లెక్స్‌లు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. మహేష్ బాబు AMB సినిమాస్.. విజయ్ దేవరకొండ AVD సినిమాస్.. ని ఇప్పటికే లాంచ్ చేశారు. త్వ‌ర‌లో అల్లు అర్జున్ AAA సినిమాస్ ని ఏషియన్ సినిమాస్ సంస్థ భాగస్వామ్యంలో నిర్మించింది.

బన్ని సొంత మల్టీ ప్లెక్స్ ను అమీర్ పేట్ లో త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు. ఇక మరో ఐకానిక్ థియేటర్ గా AMB విక్టరీ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు ఏషియన్ సినిమాస్ సంస్థ సన్నాహకాల్లో ఉన్నారని స‌మాచారం. మ‌హేష్ బాబు, రానా, వెంక‌టేష్‌ల‌తో ఏషియన్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ కొత్త మ‌ల్టీ ప్లెక్స్ స్టార్ట్‌ చేయ‌నున్నట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శ‌న్ థియేటర్ స్థలంను ఓ భారీ మాల్‌గా రూపొందించ‌నున్నార‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment