Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ తో లవ్ లో ఉన్నానంటూ.. ఆ హీరోయిన్ పోస్టులు.. నిజ‌మెంత‌ ?

October 16, 2021 7:25 PM

Sai Dharam Tej : టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా బైక్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా సినీ ఇండస్ట్రీలో ఈ హీరో పెళ్ళి హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు సాయి తేజ్ ఓ హీరోయిన్ తో లవ్ లో ఉన్నారనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు.. లారిస్సా బోనెసి.

this actress posts about Sai Dharam Tej may be they are in love

బ్రెజిలియన్ మోడల్ కమ్ హీరోయిన్. తిక్క సినిమాలో సాయి తేజ్ కి జోడీగా నటించింది. ఆమెతో సాయితేజ్ లవ్ విషయంపై మెగా ఫ్యామిలీ గాసిప్స్ పై రెస్పాండ్ అవ్వడం ఎందుకులే అనుకుందో ఏమో సైలెంట్ గా ఉండిపోయింది. కానీ లేటెస్ట్ గా ఈ బ్యూటీ పెట్టే పోస్టులు చూస్తుంటే మాత్రం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా.. అని వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి తేజ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ.. రిపబ్లిక్ మూవీ రిలీజ్ టైమ్ లో.. నా తేజు నటించిన రిపబ్లిక్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందంటూ ఓ ట్వీట్ చేసింది. అలాగే ఐ మిస్ యూ తేజ్ అంటూ రీసెంట్ గా మరో ట్వీట్ చేసింది. ఇక తన ప్రేమను ఖరారు చేసేంత రేంజ్ లో ఐ యామ్ ఇన్ లవ్ అంటూ మరో ట్వీట్ తో ప్రేక్షకులకు సీన్ అర్థమైపోయింది. ఇంకేం లారిస్సా, సాయిధరమ్ తేజ్ తో లవ్ ఉందని కన్ఫార్మ్ చేసేశారు. ఇదే కనుక నిజమైతే మరి సాయి తేజ్, లారిస్సా ను పెళ్ళి చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సాయి తేజ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. మరికొద్ది రోజుల్లో సాయి తేజ్ షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now