Manchu Vishnu : మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీకి అందని ఆహ్వానం..?

October 16, 2021 7:09 PM

Manchu Vishnu : మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. మంచు విష్ణు కార్యవర్గ సభ్యులు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో పలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రోగ్రామ్ కి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Manchu Vishnu invited mega star chiranjeevi to oath ceremony or not

అదే విధంగా నందమూరి బాలకృష్ణను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో మంచు విష్ణు, మోహన్ బాబు బాలకృష్ణ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. సినీ పెద్దలైన పరుచూరి బ్రదర్స్, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంను కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు.. మెగాస్టార్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అలాగే మంచు విష్ణు సోదరుడైన మంచు మనోజ్.. పవన్ కళ్యాణ్ ను భీమ్లా నాయక్ షూటింగ్ సెట్ దగ్గర కలిశారు. ఈ క్రమంలో మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారని సినీ వర్గాల టాక్. మా అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని వెళ్ళాలని చెప్పిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్ లోనే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment