Balakrishna Jabardasth : రోజాతో క‌లిసి జ‌బ‌ర్ధ‌స్త్ షోకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌నున్న బాల‌కృష్ణ‌..!

October 16, 2021 10:17 AM

Balakrishna Jabardasth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ షోకి మొద‌ట్లో నాగ‌బాబు జడ్జిగా వ్య‌వ‌హ‌రించేవారు. రోజాతో క‌లిసి ఆయ‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. నాగ‌బాబు వెళ్లిన త‌ర్వాత చాలా మంది గెస్ట్‌లు జ‌డ్జిలుగా వ‌చ్చారు. ఇప్పుడు మ‌నో ఫిక్స్ అయిపోయాడు. అయితే రానున్న రోజుల‌లో బాల‌కృష్ణ కూడా జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జిగా ఉంటాన‌ని తాజాగా ఫోన్ కాల్ ద్వారా తెలిపారు.

Balakrishna Jabardasth he said he will be judge with roja in the show

తాజాగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో రోజా – బాలకృష్ణలు ఫోన్‌లో మాట్లాడుకుని సందడి చేశారు. బాల‌కృష్ణ‌కి ఫోన్ చేసిన రోజా.. త‌ను రోజాని అని చెప్ప‌గానే, హా రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని చూపించారు. ‘బాగున్నారా?’.. అని రోజా అడగ్గా.. ‘బాగున్నానమ్మా.. మీరు ఎలా ఉన్నారు? అని యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ‘నేను బాగున్నా సార్.. నేను జబర్దస్త్ సెట్స్ నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పారు.

‘మన అఖండ సినిమా షూటింగ్ జరుగుతోంది’ అని చెప్పిన బాల‌య్య‌ను మన ఇద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దాం అని రోజా అడిగింది . భైరవద్వీపం పార్ట్ 2 లేదంటే బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా ? అని అడుగుతున్నారు.. అని రోజా అడిగేసరికి బాలయ్య పెద్దగా నవ్వేశారు. తప్పకుండా చేద్దాం అందరూ ఎదురుచూస్తున్నారు.. మన కాంబినేషన్ కోసం.. కలసి సినిమా చేయడమే కాదు.. జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా వస్తాను.. మీ అందర్నీ కలుస్తాను అని మాట ఇచ్చారు బాలయ్య. అనంత‌రం ఆది, రాఘవ వీళ్లంతా ఎలా ఉన్నారు అని అడిగారు. మొత్తానికి బాలయ్య ఫోన్ కాల్ జ‌బ‌ర్ధ‌స్త్ అభిమానుల‌లో జోష్ పెంచిందనే చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now