Fact Check : ఆర్య‌న్ ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టిన ఎన్‌సీబీ అధికారి..?

October 15, 2021 7:25 PM

Fact Check : డ్ర‌గ్స్ కేసులో అరెస్టు అయిన ఆర్య‌న్ ఖాన్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ చేసిన కోర్టు నిర్ణ‌యాన్ని వెలువ‌రించేందుకు ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు వాయిదా వేసింది. దీంతో ఆర్య‌న్ ఖాన్ మ‌రో 6 రోజుల పాటు జైలులోనే ఉండ‌నున్నాడు. అయితే ఆర్య‌న్ ఖాన్ గురించిన ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Fact Check ncb official slapped aryan khan is it true

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖెడె.. ఆర్య‌న్ ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టాడ‌నే వార్త వైర‌ల్ గా మారింది. షారూఖ్ ఖాన్ త‌న కుమారున్ని ప‌రామ‌ర్శించేందుకు స‌మీర్‌కు ఫోన్ చేయ‌గా.. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన స‌మీర్‌.. హోల్డ్ లో ఉండ‌మ‌ని చెప్పి.. ఆర్య‌న్‌ను పిలిచి.. షారూఖ్ వింటుండ‌గానే.. ఆర్య‌న్‌ను చెంప దెబ్బ కొట్టాడ‌ని.. త‌రువాత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌డుచుకుని ఉంటే మీ కొడుకు ఇలా ఉండాల్సి వ‌చ్చేది కాద‌ని.. షారూఖ్‌కు చెప్పాడ‌ట‌.. ఇలా ఓ వార్త తెగ ప్ర‌చారం అవుతోంది.

అయితే దీనిపై సమీర్ స్పందించారు. తాను ఆర్య‌న్ ఖాన్ ను చెంప దెబ్బ కొట్టాన‌ని వస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని అన్నారు. అయితే జైలులో ఉన్న ఆర్య‌న్ ఖాన్ కేవ‌లం బిస్కెట్లు త‌ప్ప ఏమీ తిన‌డం లేద‌ని.. అత‌ని త‌ల్లి గౌరీ ఖాన్ తీవ్రంగా దుఃఖిస్తుందని వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఆర్య‌న్ ఖాన్ త‌న తండ్రి షారూఖ్‌కు తెచ్చిన త‌ల‌నొప్పులు అన్నీ ఇన్నీ కావ‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now