Sai Dharam Tej : తేజ్ కోసం ఎన్నో ప్రార్ధ‌న‌లు చేశారు.. వారంద‌రికీ కృత‌జ్ఞ‌తలు తెలిపిన చిరు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

October 15, 2021 4:55 PM

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ అభిమానుల‌కి ఈ రోజు డ‌బుల్ ఆనందం దొరికిన‌ట్టే. ఒక‌వైపు ద‌స‌రాతో అంద‌రి ఇళ్ల‌ల్లో సంతోషాలు నెలకొని ఉండ‌గా, మ‌రోవైపు మంచి శుభ‌వార్త అందించారు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు వెల్లడించారు.

Sai Dharam Tej discharged from hospital chiranjeevi pawan kalyan comment

‘విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. అది ఏమిటంటే.. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో నేడు ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్‌’..’’ అని చిరంజీవి తెలిపారు.

 

అనుకోని రీతిలో ప్ర‌మాదం బారిన ప‌డి గ‌త నెల రోజులుగా చికిత్స పొందిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావ‌డం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని క‌లిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు అందుకుని ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు మ‌రింత‌గా పొందాల‌ని శక్తి స్వ‌రూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుండి అభిమానులు ఎంతో బాధ‌ప‌డి.. తేజ్ క్షేమంగా ఉండాల‌ని కోరుకున్నారు. ఆల‌యాల్లో, ప్రార్ధ‌న మందిరాల్లో పూజ‌లు చేశారు. వారంద‌రి ప్రార్ధ‌న‌లు ఫ‌లించాయి. ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.. అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now