Aha Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ కామెంట్లు.. ‘మా’ వివాదంపైనేనా ?

October 14, 2021 8:23 PM

Aha Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఆహా యాప్‌లో రానున్న ఓ టాక్‌షోకు వ్యాఖ్యాత‌గా మారార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆ టాక్ షోను ఆయ‌న లాంచ్ చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ముందు ఆయ‌న‌ను మంచు మోహ‌న్ బాబు, విష్ణులు క‌లిశారు. త‌న కుమారుడికి స‌పోర్ట్ ఇచ్చినందుకు మోహ‌న్ బాబు.. బాల‌కృష్ణ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌రువాత బాల‌కృష్ణ టాక్ షోను లాంచ్ చేశారు.

Aha Balakrishna ott talk show launched

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ఆహా కోసం ఈ షో చేయడం ఆనందంగా ఉంద‌న్నారు. అనేక జాతీయ, అంతర్జాయతీయ ఓటీటీలకు దీటుగా ఆహా కూడా ఎదగాలని అన్నారు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఆహాలో బాలకృష్ణ టాక్ షో అనడంతో.. ఈ షోపై ఉన్న ఆసక్తి ఇంకా పెరిగింది. ఇక ఈ షో లాంచ్ సందర్భంగా అనేక విషయాలపై బాలకృష్ణ మాట్లాడారు.

సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్క‌డైనా స‌రే పోటీ ఉంటుంద‌న్నారు. పోటీ ఉండాలని.. అలాంటప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అయితే అది కేవలం సినిమాలకు, రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని బాలకృష్ణ అన్నారు. బావిలో కప్పల మాదిరిగా అక్కడే ఉండిపోవద్దని సూచించారు. కాగా బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్నాయి. ఆయ‌న ‘మా’ వివాదం నేప‌థ్యంలోనే ఈ విధంగా ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. అయితే ‘మా’ లో నెల‌కొన్న వివాదం ఎప్పుడు స‌ద్దుమ‌ణుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now