Maa : ‘మా’ వివాదం.. మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యుల‌కు ఇక‌పై నో సినిమా చాన్స్ ?

October 14, 2021 6:37 PM

Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఇరు ప్యానెల్స్ కు చెందిన స‌భ్యులు.. అంద‌రం ఒక‌టే అన్నారు. ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా.. స్పోర్టివ్‌గా తీసుకుంటామ‌ని.. అంద‌ర‌మూ క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని చెప్పారు. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఆ మాట‌ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఒక‌రిపై ఒక‌రు కారాలు మిరియాల‌ను నూరుతున్నారు.

Maa  controversy may be there are no cinema chances for manchu vishnu panel

ముఖ్యంగా ప్ర‌కాష్ రాజ్, ఆయ‌న ప్యానెల్ స‌భ్యులు ప్రెస్ మీట్ పెట్టాక‌.. న‌రేష్ వారిని ఉద్దేశించి ముండ‌మోపి ఏడుపులు.. అని దారుణంగా కామెంట్లు చేశారు. దీంతో అగ్నికి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అయింది. అయితే ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో న‌టీన‌టుల భ‌విష్య‌త్తుపై సందేహాలు వ‌స్తున్నాయి.

ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎక్కువ సినిమాలు తీస్తూ ఉంటుంది. అందువ‌ల్ల వారి మూవీల్లో చాలా మందికి అవ‌కాశాలు వ‌స్తుంటాయి. మోహ‌న్ బాబు కుటుంబం కూడా సినిమాలు తీస్తుంటుంది. కానీ వారి మూవీలు చాలా త‌క్కువ‌గా వ‌స్తుంటాయి. అయితే ‘మా’ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో మంచు విష్ణు ప్యానెల్‌లో ఉన్న న‌టీన‌టుల‌కు ఇక‌పై సినిమాల్లో అవ‌కాశాలు ఇచ్చే అంశాన్ని ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ప‌రిశీలిస్తున్న‌ద‌ట‌.

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో తీవ్రంగా హ‌ర్ట్ అయిన చిరంజీవి, ఆయ‌న సోద‌రులు, ప్ర‌కాష్ రాజ్‌, ఆయ‌న ప్యానెల్ స‌భ్యులు.. మంచు విష్ణు ప్యానెల్ న‌టీన‌టుల‌ను బ్లాక్ లిస్టులో పెట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు.. అని టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే విష్ణు ప్యానెల్‌లో పోటీ చేసిన వారితోపాటు వారికి మ‌ద్ద‌తుగా నిలిచిన న‌టుల‌కు కూడా ఇక‌పై మెగా ఫ్యామిలీ సినిమాల్లో అవ‌కాశాలు పూర్తిగా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

అయితే ముందు ముందు ఇరు ప్యానెల్స్ మ‌ధ్య రాజీ కుదిరి అంద‌రూ ‘మా’ బాగు కోసం, న‌టీన‌టుల సంక్షేమం కోసం ప‌నిచేస్తే.. ఎప్ప‌టిలా అంద‌రికీ అవ‌కాశాలు వ‌స్తాయి. కానీ ఈ వివాదం ఇంత‌టితో ఆగ‌కుండా.. ఒక‌రిపై ఒక‌రు ఇలాగే దూష‌ణ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ వెళితే.. పైన చెప్పిన‌ట్లుగా మెగా ఫ్యామిలీ సినిమాల్లో మంచు ప్యానెల్ స‌భ్యుల‌కు సినిమా అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోవ‌డం ఖాయం అవుతుంది. మరి ఈ వివాదం ముగుస్తుందా.. లేదా.. అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now