Samantha : స‌మంత గొప్ప‌త‌నం గురించి చెప్పేందుకు ఈ ఒక్క విష‌యం చాలు.. నిందించడం ఆపండి..!

October 14, 2021 2:56 PM

Samantha : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్న త‌రువాత ఎక్కువ‌గా స‌మంత‌నే నిందిస్తున్నారు. ఆమె స్కిన్ షో చేయ‌డం వ‌ల్లే విడాకులు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని కొంద‌రు అంటుండ‌గా.. ఆమెకు పిల్ల‌ల్ని క‌నాల‌నే ఉద్దేశం లేద‌ని.. అందుక‌నే అక్కినేని ఫ్యామిలీతో పొస‌గ‌క ఆమె విడాకులు తీసుకుంటుంద‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. అయితే నిజానికి స‌మంత గొప్ప‌త‌నం గురించి చాలా మందికి తెలియ‌దు.

Samantha is a very good person in her human angle

మ‌న దేశంలో పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్ధులు అనేక మంది ఉన్నారు. అలాగే చాలా మందికి స‌రైన వైద్య చికిత్స ల‌భించ‌డం లేదు. కొంద‌రికి చికిత్స చేస్తే ఆరోగ్యం మెరుగ‌వుతుంది. కానీ అందుకు భారీగా ఖ‌ర్చు అవుతుంది. అయితే ఇలాంటి వారంద‌రినీ స‌మంత త‌న ప్ర‌త్యూష స‌పోర్ట్ ద్వారా ఆదుకుంటోంది.

స‌మంత తాను సినిమాల ద్వారా సంపాదించే డ‌బ్బుతోపాటు ఏదైనా కార్య‌క్ర‌మానికి వెళ్లినా, ఓపెనింగ్ లు చేసినా, ప్రొడ‌క్ట్‌ల‌కు యాడ్‌లు చేసినా.. వ‌చ్చే దాంట్లో చాలా మొత్తాన్ని ఆ ఫౌండేష‌న్‌కే విరాళంగా అందిస్తుంది. ఈ క్ర‌మంలోనే 2014లో ప్ర‌త్యూష స‌పోర్ట్‌ను స‌మంత ప్రారంభించింది. దీని ద్వారా ఎంతో మందికి వైద్య‌, ఆర్థిక స‌హాయాన్ని అందిస్తున్నారు. అందుక‌ని స‌మంత‌ను నిందించే ముందు ఆమె చేసే గొప్ప పనుల‌ను ఒక్క‌సారి ప‌రిశీలించండి. ఎవ‌రి వ్య‌క్తి జీవితంలో అయినా స‌రే ఒడిదుడుకులు ఉంటాయి. వాట‌న్నింటినీ దాటుకుని స‌మంత ముందుకు సాగాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment