Maa : ముండమోపిలా ఏడుపులెందుకు.. అంటూ న‌రేష్ అంత మాట అనేశాడేంటి?

October 13, 2021 8:18 PM

Maa : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌ల వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు, మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడులు చేసుకుంటున్నారు. ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత ఈ గొడ‌వ‌లు స‌మ‌సిపోతాయ‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికీ, మా ఎన్నిక‌ల సినిమా క్లైమాక్స్‌కి ఇప్ప‌ట్లో బ్రేక్ ప‌డేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా న‌రేష్ ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కాడు.

Maa naresh controversial comments on prakash raj panel

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షడు నరేశ్.. ‘మా’ ఒక సేవా సంస్థ , ఇక్క‌డ‌ ఎన్నికలు అయిపోయాక ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. ముండమోపిలా ఏడుపులెందుకు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతిగా ఏడ్చేవాళ్లని నమ్మొద్దని పేర్కొన్నారు. ‘కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు ? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది ? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి ? అని న‌రేష్ అన్నాడు.

విష్ణుని ఎవరైనా డిస్ర్టర్భ్‌ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్‌.. ప్రస్టేషన్‌ వద్దు. మా’ లో పెత్తందారీ వ్యవస్థ పోవాలని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రశ్నించే వారు ఏం ప్రశ్నిస్తారో చూస్తామని చెప్పారు. ఇక కౌంటింగ్ లో తప్పులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు వాళ్లు పక్కనే ఉన్నారు. అలాగే ప్రెస్ మీట్ పెట్టి మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారు.. అంటూ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు స్పందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now