Akhil Akkineni : బిగ్ బాస్ షోలో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డ్ సాధించిన నాగార్జున త‌న‌యుడు..!

October 13, 2021 2:19 PM

Akhil Akkineni : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని బిగ్ బాస్ షో ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఈ షోని త‌మ సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకునేందుకు కూడా కొంద‌రు సెలబ్స్ వాడుకుంటున్నారు. సీజ‌న్ 5లో మాస్ట్రో టీంతోపాటు కొండ పొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ టీంలు వ‌చ్చాయి. అయితే బిగ్ బాస్‌ని వాడుకొని త‌న సినిమాను రెండు సార్లు ప్ర‌మోట్ చేసుకొనే అవ‌కాశం అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్‌కి ద‌క్కింది.

Akhil Akkineni done amazing feat in bigg boss telugu show

అఖిల్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా దసరా పండగ సందర్భంగా మోస్ట్ ఎలిజిబులర్ బ్యాచిల‌ర్ సినిమాను ప్ర‌మోట్ చేసుకున్నాడు. అప్పుడు స‌మంత హోస్ట్‌గాఉంది. ఈ ద‌స‌రాకు అఖిల్, పూజా హెగ్డే ప్రత్యేకంగా పాల్గొని దసరాకి విడుదల అవుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గురించి ప్రమోట్ చేసుకున్నారు. ఒక న‌టుడు రెండు సార్లు బిగ్ బాస్ వేదిక‌పై త‌న సినిమాని ప్ర‌మోట్ చేసుకోవ‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

బిగ్ బాస్ స్టేజ్ మీద మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ టీం ఎంత‌గా సంద‌డి చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేలు బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. ఎవ్వరినీ పట్టించుకోకుండా ఈ ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయారు. హౌజ్‌మేట్స్‌తో ప‌లు విష‌యాల గురించి మాట్లాడారు. పూజా హెగ్డేను ఇంప్రెస్ చేసే టాస్క్ ఇంటి సభ్యులకు నాగార్జున ఇచ్చేశాడు. అయితే శ్రీరామ్ తన వాయిస్‌తో పడగొట్టేందుకు సామజవరగమన అనే పాటను పాడేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now