Maa : ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మొత్తం 11 మంది స‌భ్యుల మూకుమ్మ‌డి రాజీనామా..!

October 12, 2021 5:14 PM

Maa : మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌గిల్చిన ర‌గ‌డ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌కాష్ రాజ్ తోపాటు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న నాగ‌బాబు ఇది వ‌ర‌కే రాజీనామా చేశారు. త‌మ రాజీనామాల‌ను మా అధ్య‌క్షుడు మంచు విష్ణుకు ఇప్ప‌టికే పంపించారు. అయితే తాజాగా ప్ర‌కాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు.

Maa association prakash raj panel members resigned

ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీ‌కాంత్‌, ఉత్తేజ్ స‌హా మొత్తం 11 మంది స‌భ్యులు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాము బ‌య‌టనే ఉంటామ‌ని, మంచు విష్ణు త‌న‌కు ఇష్టం వ‌చ్చిన వారిని మా స‌భ్యులుగా ఎంపిక చేసి వారంద‌రితో క‌లిసి ప‌నిచేయ‌వ‌చ్చ‌ని.. వారు ఏ ప‌ని చేసినా తాము చూస్తూనే ఉంటామ‌ని.. అయితే ఎన్నిక‌ల్లో చెప్పిన వాగ్దానాల‌ను నెర‌వేర్చాల‌ని.. మా స‌భ్యుల సంక్షేమానికి కృషి చేయాల‌ని.. లేదంటే తాము ప్ర‌శ్నిస్తామ‌ని తెలిపారు.

ఇక మా అసోసియేష‌న్ కు తాను చేసిన రాజీనామాను మంచు విష్ణు ఆమోదించాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. బ‌య‌టి రాష్ట్రాల‌కు చెందిన వారు మా లో పోటీ చేయొద్దు, కేవ‌లం స‌భ్యులుగా మాత్ర‌మే ఉండాల‌ని బై లాస్ మార్చితే త‌న రాజీనామాను ఆమోదించాల‌ని, లేదంటే తాను త‌న రాజీనామాను వెన‌క్కి తీసుకుంటాన‌ని.. ప్ర‌కాష్ రాజ్ స్ప‌ష్టం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now