Shruti Haasan : పెళ్లీడు వ‌చ్చింది.. మొన్న కాజ‌ల్, నేడు ర‌కుల్‌, రేపు మరో స్టార్ హీరోయిన్ !

October 12, 2021 11:19 AM

Shruti Haasan : టాలీవుడ్ గ్రేస్ హీరోయిన్ శృతి హాసన్ కు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో సైతం స్పెషల్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది. అతి త్వరలో గుడ్ న్యూస్ చెప్పేస్తున్న శృతి హాసన్ అంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శృతి హాసన్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి ఎంటర్ అవ్వబోతుందని అంటున్నారు. కొన్నాళ్ళుగా డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతను హజారికాతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ కలిసి సోషల్ మీడయాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

Shruti Haasan to marry her boy friend very soon

షాపింగ్ లతో పాటు కొత్త కొత్త వెరైటీ ఫుడ్స్ ని టేస్ట్ చేస్తుంటారు. యోగా, ఫిట్ నెస్ లతో వర్కవుట్స్ చేసిన వీడియోస్ ని కూడా తమ అభిమానులతో షేర్ చేస్తుంటుంది శృతి హాసన్. శాంతను హజారికాను తన తండ్రి కమల్ హాసన్ కు కూడా పరిచయం చేసింది. శృతి హాసన్ నిర్ణయానికి తండ్రి అనుమతి లభించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ రోజురోజుకీ పెరగడంతో అతి త్వరలోనే పెళ్ళి చేసుకుంటారనే వార్తలు హల్ చల్ అవుతున్నాయి. క్రాక్ సినిమాతో మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్.

వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడిగా సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తమిళ్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ ని డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శృతి పెళ్ళి వార్త ప్రస్తుతం హల్ చల్ కావడంతో చాలామంది ఆమె పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ లో సైతం పెళ్ళి లోకేషన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. శృతి హాసన్ తన పెళ్ళిని చెన్నైలో చేసుకుంటుందా.. లేదా ఫారెన్ లో చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now