Amitabh Bachchan : ఎస్‌బీఐకి ఆఫీస్‌ను రెంట్‌కి ఇచ్చిన బిగ్‌బీ.. నెల నెలా ఎంత అద్దె వ‌స్తుందో తెలిస్తే షాకే..!

October 11, 2021 9:24 PM

Amitabh Bachchan : దేశంలోని అతి పెద్ద ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌లో ఎస్‌బీఐ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌బీఐకి దేశ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే ముంబైలో మాత్రం ఓ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ఆఫీస్‌ను రెంట్‌కు ఇచ్చారు. దానికి నెల నెలా అద్దె ఎంత వ‌స్తుందో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే.

Amitabh Bachchan gets an amount of rs 18 lakhs as rent from sbi branch

ముంబైలోని జుహు అనే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌లోని ఆఫీస్‌ను బిగ్‌బీ ఎస్‌బీఐకి రెంట్‌కు ఇచ్చారు. ఆ ఆఫీస్ విస్తీర్ణం 3150 చ‌ద‌ర‌పు అడుగులు. కాగా ఆ బిల్డింగ్ అమితాబ్ నివాసానికి ద‌గ్గ‌ర్లోనే ఉంటుంది. ఇక ఆ భ‌వంతికి నెల నెలా అద్దెకు గాను ఎస్‌బీఐ ఏకంగా రూ.18.9 ల‌క్ష‌లను అమితాబ్‌కు చెల్లిస్తోంది.

15 ఏళ్లకు ఒక‌సారి లీజ్ కింద అగ్రిమెంట్ ఉంది. 5 ఏళ్ల‌కు ఒక‌సారి 25 శాతం రెంట్‌ను పెంచే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఆ ఆఫీస్‌కు ఎస్‌బీఐ ఏకంగా రూ.18.9 ల‌క్ష‌ల‌ను నెల నెలా అమితాబ్‌కు చెల్లిస్తోంది. ఇక సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2.26 కోట్ల‌ను ఎస్‌బీఐ.. అమితాబ్ ఖాతాలో డిపాజిట్ చేసింది. ఈ వివ‌రాల‌ను ఎక‌నామిక్ టైమ్స్‌లో వెల్ల‌డించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment